Sunday, February 3, 2008

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

తనివి తీరదేలనో మనసు నిండదేలనో
తనివి తీరదేలనో మనసు నిండదేలనో

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

పెదవిపైన వేణువు వెంట చిన్న ధేనువు
పెదవిపైన వేణువు వెంట చిన్న ధేనువు

అతని పాదసేవలో నేనె తానౌదునా
అతని పాదసేవలో నేనె తానౌదునా

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

ఆలయాన భక్తితో అర్చనలే చేసినా
ఆలయాన భక్తితో అర్చనలే చేసినా

నేనె ఆ రాధనై నేనె ప్రేమ గాధనై
నేనె ఆ రాధనై నేనె ప్రేమ గాధనై

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

మొలను పట్టు చేలము శిరముపైన పించము
మొలను పట్టు చేలము శిరముపైన పించము

గోపాలుని చందము చూడ చూడ అందము
గోపాలుని చందము చూడ చూడ అందము

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా
స్వామిపాద సన్నిధిలో సకలము సమర్పించినా

తనివి తీరదేలనో మనసు నిండదేలనో
తనివి తీరదేలనో మనసు నిండదేలనో

ఎన్నిపూలు కోసినా ఎన్ని మాలలల్లినా

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home